మా గురించిEN

మా గురించి

తెలుగు క్యాలెండర్, పంచాంగం: ఓపెన్ తెలుగు సైట్. ప్రకటనలు లేవు, ఖాతాలు లేవు.

లెక్కలు ఎలా

తిథి, నక్షత్రం, సూర్యోదయం మొదలైనవి మీ పరికరంలోనే, ఖగోళ గణితంతో (దృక్ పద్ధతి), మీరు ఎంచుకున్న చోటికి లెక్కిస్తాం. నక్షత్రాలకు లాహిరి అయనాంశ; మాసాలు అమావాస్య నుంచి అమావాస్య వరకు (అమాంత), తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వాడుకలో ఉన్నట్టు. రోజు తిథి, నక్షత్రం ఆ ఊరి సూర్యోదయానికి ఉన్నవి.

ఎంత ఖచ్చితం

హైదరాబాద్‌కు 2026, 2027 సంవత్సరాల ప్రతి రోజునూ ఒక స్వతంత్ర ఖగోళ గణనతో (Astronomy Engine) పోల్చి చూశాం: తిథి ముగిసే సమయం 2 నిమిషాల లోపు, నక్షత్రం ముగిసే సమయం అర నిమిషం లోపు సరిపోయాయి. ముద్రిత పంచాంగాలు వేరే పద్ధతి లేదా వేరే ఊరు వాడితే సమయాలు మారవచ్చు; పూజలకు మీ పంచాంగం చూడండి.

పండుగలు, సెలవులు

ప్రభుత్వ సెలవులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల నుంచి, విడివిడిగా. ఉత్తర్వు ఇంకా రాని సంవత్సరానికి ఆ మాటే చెబుతాం. మిగతా పండుగల తేదీలు లెక్కించినవి, ప్రస్తుతానికి హైదరాబాద్ (తెలంగాణ), విజయవాడ (ఆంధ్రప్రదేశ్) ఆధారంగా.

ఊళ్ల జాబితా

జిల్లా కేంద్రాలు ఓపెన్ తెలుగు సమాచారం నుంచి; భారతదేశంలోని మిగతా పట్టణాలు GeoNames నుంచి (CC BY 4.0); ఇతర దేశాల పట్టణాలు (15,000 జనాభా పైబడినవి) కూడా అక్కడి నుంచే.

ఇతర దేశాల్లో

భారతదేశం బయటి ఊరికి రోజు, తేదీ, సమయాలు అన్నీ ఆ ఊరి గడియారం ప్రకారమే (వేసవి సమయ మార్పుతో సహా); తిథి ఆ ఊరి సూర్యోదయానికి ఉన్నది; పండుగలు ఆ ఊరిలో వాటి నియమం ప్రకారం నిర్ణయించినవి, కాబట్టి ఒక పండుగ హైదరాబాద్‌లో కంటే ఒక రోజు ముందు రావచ్చు. భారత ప్రభుత్వ సెలవులు మీరు రాష్ట్రం ఎంచుకుంటేనే కనిపిస్తాయి. గ్రహణాల జాబితా భారతదేశంలో కనిపించేవాటిది కాబట్టి అక్కడ చూపము. ఈ తేదీలను అక్కడి ముద్రిత క్యాలెండర్‌తో ఇంకా పోల్చి చూడలేదు.

చిత్రాలు

క్యాలెండర్‌పై పెట్టుకోగల చిత్రాలు వికీమీడియా కామన్స్ నుంచి; ప్రతిదాని పరిమాణం మాత్రమే మార్చాం. ప్రతి చిత్రం మూలం, లైసెన్స్: